CSK Vs DC : రాణించిన కేఎల్ రాహుల్.. సీఎస్కేకి ఈ టార్గెట్ సరిపోతుందా?

CSK Vs DC : రాణించిన కేఎల్ రాహుల్.. సీఎస్కేకి ఈ టార్గెట్ సరిపోతుందా?
CSK Vs DC : రాణించిన కేఎల్ రాహుల్.. సీఎస్కేకి ఈ టార్గెట్ సరిపోతుందా?

అక్షర టుడే, వెబ్ డెస్క్ CSK Vs DC : ఐపీఎల్ 2025లో (IPL 2025) మ‌రో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ రోజు రెండు మ్యాచ్‌లు ఉండ‌గా.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయపడడంతో.. ఈరోజు ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, రుతురాజ్ గైక్వాడ్ టాస్‌కి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే డీసీలో కేఎల్ రాహుల్ (KL Rahul) (51 బంతుల్లో 77; 6 ఫోర్స్ , 3 సిక్స్‌లు) అర్ధ సెంచ‌రీతో జ‌ట్టుకి మంచి స్కోరు ద‌క్కేలా చేశాడు.

Advertisement
Advertisement

చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) స్పిన్న‌ర్ల‌ను ఉతికారేసిన రాహుల్ (KL Rahul) అర్ధ శ‌త‌కం సాధించాడు. ప‌థిర‌న‌ సింగిల్ తీసి అత‌డు 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌కు ఐపీఎల్‌లో ఇది 38వ హాఫ్ సెంచ‌రీ. అయితే టాస్ గెలిచిన ఢిల్లీకి శుభారంభం ద‌క్క‌లేదు. ఓపెన‌ర్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(0)ను ఖ‌లీల్ అహ్మ‌ద్ (Khalil Ahmed) డ‌కౌట్‌గా వెన‌క్కి పంపాడు. ఆ త‌ర్వాత కేఎల్ రాహుల్(77), అభిషేక్ పొరెల్‌(33)లు దూకుడుగా ఆడారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్న పొరెల్‌ను జ‌డేజా బోల్తా కొట్టించి పెవీలియ‌న్‌కి పంపాడు. అక్క‌డితో 54 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్(21) ఔట‌య్యాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Rishabh Pant : మార‌ని పంత్ తీరు.. రూ.27 కోట్ల ఆటగాడు ఇలానేనా ఆడేది..!

నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడ‌బోయిన అక్ష‌ర్.. క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దాంతో, 90 వ‌ద్ద ఢిల్లీ మూడో వికెట్ ప‌డింది. కెప్టెన్ వెనుదిర‌గ‌డంతో మూడో వికెట్‌కు 36ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం రాహుల్,స్ట‌బ్స్(24) (KL Rahul) విలువైన ప‌రుగులు చేశారు. రాహుల్ భారీ షాట్‌కి య‌త్నించి ఔట‌య్యాడు. అయితే చివ‌రిలో సీఎస్కే బౌల‌ర్స్ (CSK bowlers) అద్భుత‌మైన బౌలింగ్‌తో పాటు మంచి ఫీల్డింగ్ చేయ‌డంతో ప‌రుగులు రావ‌డం క‌ష్ట‌మైంది. ఈ క్ర‌మంలో 20 ఓవ‌ర్ల‌కి గాను ఆరు వికెట్లు కోల్పోయి డీసీ 183 ప‌రుగులు చేసింది. సీఎస్కే బౌల‌ర్స్ లో ఖ‌లీల్ రెండు వికెట్లు తీయ‌గా, జ‌డేజా, పూర్, ప‌తిరానా ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Advertisement