అక్షరటుడే, వెబ్ డెస్క్ KL Rahul : ఐపీఎల్ (IPL) తాజా సీజన్‌లో ఢిల్లీ అదరగొట్టేస్తుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకుపోతుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తనదైన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు రాహుల్ rahul. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆరంభంలో స్లోగా ఆడిన రాహుల్.. (KL Rahul) ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగాడు. రాహుల్ విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. అయితే ఈ విజయానంతరం కేఎల్ రాహుల్ చేసుకున్న సంబరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
KL Rahul : ఇది నా అడ్డా…
బెంగళూరు bangalore నా సొంత మైదానం. ఇక్కడ ఎలా ఆడాలో నా కంటే బాగా ఇంకెవరి తెలుస్తుంది అని కేఎల్ రాహుల్ (KL Rahul) చెప్పుకొచ్చాడు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో రాహుల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న తరువాత రాహుల్ మాట్లాడుతూ.. 20 ఓవర్ల పాటు వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ పిచ్ ఎలా స్పందిస్తుందో చూడడం తనకు ఎంతో సాయపడిందన్నాడు. వికెట్‌లో కొంచెం స్థిరంగా ఉందని గ్రహించాను. అయితే.. అంతా కాదు. ఏ బ్యాటర్ ఎలాంటి షాట్లు ఆడి ఔట్ అయ్యారో గమనించి బ్యాటింగ్‌లో రాణించగలిగాను అని కేఎల్ అన్నాడు.
అయితే ఒకప్పుడు రాహుల్ కి టీంలో స్థానం కోసం గట్టి పోటీ ఉండేది. కానీ ఈ మధ్య మంచి ఫామ్‌లో కనిపిస్తున్న రాహుల్ ఇండియా టీంలో తన ప్లేస్ సుస్థిరం చేసుకోవడం ఖాయం అంటున్నారు. కేఎల్ రాహుల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు రంజీలో కర్ణాటక తరుపున చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy Stadium) ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలోని పిచ్, పరిస్థితులపై ఆర్‌సీబీలోని చాలా మంది ఆటగాళ్ల కంటే కూడా కేఎల్ రాహుల్‌కు ఎంతో అవగాహన ఉంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ RCB నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది.