nizamabad city | కెనాల్​కట్టపై కత్తిపోట్ల కలకలం
nizamabad city | కెనాల్​కట్టపై కత్తిపోట్ల కలకలం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CRIME : నిజామాబాద్ న‌గ‌రంలోని గాజుల్‌పేట్‌లో మంగ‌ళ‌వారం క‌త్తిపోట్ల ఘ‌ట‌న క‌ల‌కలం సృష్టించింది. కాల‌నీలో జ‌రిగిన నాయిబ్రాహ్మ‌ణ సంఘం స‌మావేశంలో ఇరువురి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సంతోష్ అనే వ్య‌క్తిపై మహేష్ అనే వ్య‌క్తి కత్తితో దాడి చేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని బాధితుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం మహేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Advertisement
Advertisement
Advertisement