అక్షర టుడే, ఆర్మూర్: పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో ఆదివారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పెర్కిట్ కు చెందిన తాహెర్(21)పై పట్టణానికి చెందిన షాహిద్, జీషన్, వాజిద్, సమీర్ కత్తులతో దాడి చేశారు. దీంతో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిజామాబాద్ జీజీహెచ్ కు పంపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Registration office | ఆర్మూర్‌లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్​ స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభం