అక్షరటుడే, వెబ్‌డెస్క్ Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ Virat Kohli ఇప్పుడు IPL ఐపీఎల్‌కి సన్నద్ధమవుతున్నాడు.అయితే ఐపీఎల్‌కి వెళ్లేముందు కోహ్లీ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. క్రికెటర్లు విదేశీ పర్యటనలో వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లకూడదని బీసీసీఐ BCCI నిర్ణయం తీసుకోవడాన్ని విరాట్ కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టారు.
మ్యాచ్ ఆడే సమయంలో క్రీడాకారులు చాలా ఒత్తిడితో ఉంటారని, ఆ సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పులేదని కోహ్లీ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఒత్తిడిని అధిగమించి చురుగ్గా ఆడే అవకాశం ఉంటుందని కోహ్లీ Kohli అన్నారు. ఒత్తిడిలో ఉన్న క్రీడాకారులు స్థిరత్వంలో ఉండటం కోసం కుటుంబ సభ్యుల తోడు తప్పనిసరి అని కోహ్లీ Kohli స్పష్టం చేశారు.
Virat Kohli : దటీజ్ కోహ్లీ..
అయితే బీసీసీఐ BCCI తీసుకొచ్చిన ‘ఫ్యామిలీ రూల్’ను తప్పుబడుతూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలని కొందరు సమర్ధించారు. ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించాలని అభిప్రాయపడ్డారు కపిల్ దేవ్ Kapil Dev. కపిల్ దేవ్ Kapil Dev ముందు కోహ్లీ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అతనికి అండగా మాట్లాడాడు. తమ కాలంలో క్రికెట్, కుటుంబానికి సమ ప్రాధాన్యం ఇచ్చేవారిమని గుర్తు చేసుకున్నారు. ఆటగాళ్లతో కుటుంబం ఉండటం అవసరమే అయితే, అదే సమయంలో జట్టుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. మా కాలంలో మేం మొదట జట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. ఆ తర్వాతే కుటుంబ సభ్యులతో గడిపేవాళ్లం. అలా ఆట, కుటుంబం రెండు కలిసిపోయాయి అని అన్నారు కపిల్.
అయితే కోహ్లీ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోహ్లీ వ్యాఖ్యలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. Kohli కోహ్లీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ BCCi తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఆటగాళ్ళు ఎక్కువ కాలం తమ కుటుంబాలను పర్యటనకు తీసుకురావాలనుకుంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దీనిపై బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుందని ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపారు.