RR vs KKR | కోల్​కతా బోణీ..రాజస్థాన్​పై 8 వికెట్ల తేడాతో విజయం

RR vs KKR | కోల్​కతా బోణీ..రాజస్థాన్​పై 8 వికెట్ల తేడాతో విజయం
RR vs KKR | కోల్​కతా బోణీ..రాజస్థాన్​పై 8 వికెట్ల తేడాతో విజయం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RR vs KKR : ఐపీఎల్ -18లో కోల్​కతా నైట్​ రైడర్స్(Kolkata Knight Riders) శుభారంభం చేసింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో కోల్​కతా నైట్​ రైడర్స్ గెలిచింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్​కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది.

Advertisement
Advertisement

రాజస్థాన్ బౌలర్లలో హసరంగ ఒక వికెట్ మాత్రమే తీశాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓడర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటర్లలో ధ్రువ్ జురెల్ (33) ఈ మ్యాచ్​లో అత్యధిక స్కోర్​ చేశాడు.

టాస్ నెగ్గిన రాజస్థాన్ జట్టు.. తొలుత బ్యాటింగ్ చేపట్టి, నిర్ణీత(20) ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 151 పరుగులు చేసింది. కోల్​కతా బౌలర్ల ధాటిని రాజస్థాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (33; 28 బంతుల్లో 5 ఫోర్లు) కాస్త రాణించగలిగాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  GT vs MI, IPL - 2025 | గుజరాత్​ చేతిలో చిత్తుగా ఓడిన ముంబై జట్టు

రాజస్థాన్ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), సంజు శాంసన్ (13; 11 బంతుల్లో 2 ఫోర్లు) మైదానంలో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. కెప్టెన్ రియాన్ పరాగ్ (25, 15 బంతుల్లో 3 సిక్స్లు) దూకుడుగా ఆడి, వెంటనే పెవిలియన్​ బాట పట్టాడు. నితీశ్ రాణా (8), వానిందు హసరంగ (4), శుభమ్ దూబె (9) పస లేని ఆటతీరును ప్రదర్శించారు. చివరగా జోఫ్రా ఆర్చర్(16; 7 బంతుల్లో 2 సిక్స్లు) వల్ల స్కోరు 150 దాటగలిగింది.

కోల్​కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. స్పెన్సర్ జాన్సన్​ ఒక వికెట్ తీశాడు.

Advertisement