అక్షరటుడే, వెబ్డెస్క్ : Komatireddy | అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ముఖ్యమంత్రి(CM) రేవంత్రెడ్డి(Revanth Reddy) మంచివాడు కావడంతోనే బీఆర్ఎస్ (BRS) వారు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. నిన్నటి దాక ఒక లెక్క.. రేపటి నుండి ఇంకో లెక్క అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని రాజగోపాల్రెడ్డి అన్నారు. ప్రతిపక్షం లేకుండా చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతులు చెబుతోందని విమర్శించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఇటీవల ఏఐసీసీ(AICC) ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఉగాది తర్వాత పలువురికి అమాత్య యోగం దక్కనుంది. అయితే తనకు హోంమంత్రి(Home Minister) పదవి అంటే ఇష్టమని ఇటీవల రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆ శాఖ సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉంది. ఈ క్రమంలో సీఎం మంచివాడు కావడంతో బీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టడం లేదని కోమటిరెడ్డి అన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఒక లెక్క అంటే తనకు హోంమంత్రి పదవి వచ్చాక పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.