అక్షరటుడే, ఆర్మూర్: బీజేపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా పరిశీలకులు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. మంగళవారం నందిపేటలోని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో సభ్యత నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదుపై దిశ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, డొంకేశ్వరం మండల అధ్యక్షుడు సురేందర్, మాజీ ఎంపీటీసీ రాజు, గాండ్ల నర్సాగౌడ్ ప్రధాన కార్యదర్శి సాయికుమార్, పటేళ్ల రాజు, బీజేవైఎం ఉపాధ్యక్షుడు నాగ సురేష్, గంగాధర్, శ్రీనివాస్,మల్లయ్య, తారక్, ముత్తిరెడ్డి,హరీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.