అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మూసీ పేరుతో జరుగుతున్న లూటీని ప్రజల మధ్యకెళ్లి వివరిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా అనేది బిల్డర్లను, పెద్ద వ్యాపారవేత్తలను బ్లాక్‌మొయిల్‌ చేసి వసూళ్లు చేయడానికే వాడుతున్నట్లుగా కనిపిస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.