అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief Bomma Mahesh Kumar | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్(BRS Working President) ఎట్టిపరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సిందేనని పీసీసీ చీఫ్(PCC chief) వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెల్లరేషన్‌కార్డు (White ration card) లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ నిరాటంకంగా సాగుతోందని.. సన్నబియ్యంపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్(BRS)కు లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే దొడ్డుబియ్యంను సన్నబియ్యంగా మార్చి ఎగుమతి చేసిన విషయం మరిచారా అని ప్రశ్నించారు.
PCC Chief Bomma Mahesh Kumar | ప్రజాపాలన అంటే ఎంటో చూపించాం..
15 నెలల్లోనే ప్రజాపాలన అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చూపించిందని పీపీసీ చీఫ్ వివరించారు. అంబేడ్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో విడుదలైందన్నారు. భూభారతితో భూ వివాదాలకు పరిష్కారం లభించిందన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్‌గా రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిలిచారన్నారు. రేపు సీఎల్పీ సమావేశం నోవాటెల్(Novatel)లో జరుగనుందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నాయకులు వినోద్ రెడ్డి, ఏనుగు రవీందర్, కైలాష్ కుమార్, సిద్దేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.