అక్షరటుడే, హైదరాబాద్: land scam : కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli), HCU భూముల స్కాం గురించి నేడు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రెస్ మీట్(ktr press meet) పెట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పాయి. ఇందులో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గురించి ముఖ్య విషయాలు వెల్లడించనున్నట్లు వివరించాయి.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former minister and BRS working president KTR) ఇటీవల సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలో జరిగిన మరో భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్టు కేటీఆర్ ఇటీవలే ప్రకటించి, రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీశారు. ఈ తరుణంలో కేటీఆర్ ప్రెస్ మీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రెస్మీట్లో కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ భూకుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురాబోతున్నారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు రాజకీయ వర్గాలు(Political circles) కూడా కేటీఆర్ ప్రెస్మీట్పై ఆసక్తి చూపుతున్నాయి.