అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ట్వీట్ చేశారు. పట్నం అరెస్టు రేవంత్ చేతగాని పాలనకు నిదర్శనం అన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడిన నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తిరగ బడుతున్న ప్రజలను అణచి వేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని విమర్శించారు.