అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో తమకు తెలుసన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గాసిప్స్ బంద్ పెట్టి.. పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.
KTR | అందరి బాగోతాలు మా దగ్గర ఉన్నాయి
పదేళ్లు అధికారంలో ఉన్న తమ దగ్గర అందరి బాగోతాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉదయం 5 గంటలకు మై హోం బుజాకు వెళ్తారన్నారని ఆరోపించారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తన దగ్గర ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు.
KTR | సభలో బజారు భాష
నిండు సభలో బట్టలు విప్పి కొడుతామని సీఎం బజారు భాష మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకి అడ్డమైన వారితో లింక్‌లు పెడుతూ గతంలో పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. అప్పుడు తమ కుటుంబాలు కూడా బాధ పడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు.