BRS | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. కేటీఆర్​ రాష్ట్రవ్యాప్త పర్యటన

BRS | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. కేటీఆర్​ రాష్ట్రవ్యాప్త పర్యటన
BRS | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. కేటీఆర్​ రాష్ట్రవ్యాప్త పర్యటన
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్(KTR)​ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న కేడర్​లో ఉత్సాహం నింపడం కోసం ఆయన ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే సిల్వర్​ జూబ్లీ(Silver Jublee) వేడుకలకు నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు.

BRS | మొదట సూర్యాపేటలో..

కేటీఆర్​(KTR) రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 20న సూర్యాపేట(Suryapeta)లో, 23న కరీంనగర్​(Karimnagar)లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్​ 27 బీఆర్​ఎస్​ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిశాక కేటీఆర్​ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.

BRS | డీలాపడ్డ కార్యకర్తలు

కొద్దిరోజులుగా బీఆర్​ఎస్​ కార్యకర్తలు డీలాపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు ముఖ్య నేతలు పార్టీ మారారు. మరికొందరు అసలు నియోజకవర్గాల్లో కనిపించకుండా పోయారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ కేడర్​కు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Teenmar Mallanna | కేటీఆర్​తో భేటీ అయిన తీన్మార్​ మల్లన్న.. ఎందుకంటే..

BRS | స్థానిక ఎన్నికలే లక్ష్యంగా..

ప్రస్తుతం బడ్జెట్​ సమావేశాల్లో బీఆర్​ఎస్​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తోంది. ఆయా అంశాలపై అసెంబ్లీలో గొంతు లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. ఈ క్రమంలో సమావేశాల అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ జిల్లాల్లో పర్యటించనున్నారు. అలాగే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Advertisement