అక్షరటుడే, ఆర్మూర్ : ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తున్నామని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న పేర్కొన్నారు. కమిషన్ 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమన్నారు.