అక్షరటుడే, కామారెడ్డి : లబానా కులాన్ని బీసీ కులగణనలో చేర్చకపోవడం సరికాదని, సర్వే జాబితాలో మా కోడ్ వచ్చే వరకు కులగణనను బహిష్కరిస్తున్నామని లబానా సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కులగణనలో మా కులం గుర్తింపు కోసం ఆప్షన్ ఇవ్వాలని ఈ నెల 5న కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేశామని, చీఫ్ సెక్రెటరీలకు మెయిల్ ద్వారా కోరామన్నారు. 1977లో తాము బీసీ నుంచి ఎస్టీ జాబితాలో చేరామని, ఇప్పుడు మధుర లంబాడీ జాబితాలో చేరిస్తే ఒప్పుకోమన్నారు. మా ఆప్షన్ వచ్చే వరకు కులగణనకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 26లోపు ఆప్షన్ ఇచ్చి సర్వే చేయాలని, లేకపోతే తాము రాష్ట్రంలో లేనట్టేనన్నారు. 5 జిల్లాలు, 9 నియోజకవర్గాలు, 16 మండలాల్లో సర్వే నిలిపివేశామన్నారు. సమావేశంలో లబానా సమాజ్ రాష్ట్ర నాయకులు అమర్ సింగ్ నాయక్, రతీరాం నాయక్, జగదీష్ నాయక్, దోళత్రం, రఘురాం, జోర్ సింగ్, సూర్యబాయి, సుశీల, మున్నీబాయి, సీతాబాయి, పార్వతి, జ్యోతి పాల్గొన్నారు.