Pavan Kalyan : పవన్​ కల్యాణ్​పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pavan Kalyan : ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​పై లక్ష్మీ పార్వతి laxmi parvathi సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి Posani Krishna Murali అరెస్ట్​పై ఆమె మాట్లాడారు. పోసానిని అన్యాయంగా అరెస్ట్​ చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్​కు ఎలాగో బుద్ధి లేదని, పవన్​ కల్యాణ్​కు ఉందనుకుంటే ఇలా చేయడం సరికాదన్నారు.

Advertisement

Pavan Kalyan : అవార్డు తీసుకోకపోవడంతో..

నంది అవార్డు Nandi Award తీసుకోకపోవడంతో పోసానిని అరెస్ట్​ చేశారని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు గతంలో ఎంతోమంది అవార్డులను తిరస్కరించారని ఆమె గుర్తు చేశారు. ఒకే వర్గానికి చెందిన వారికి అవార్డులు ఇస్తున్నారని, ఐదేళ్ల క్రితం పోసాని నంది అవార్డు తీసుకోకపోవడంతో ఇప్పుడు అరెస్ట్​ చేశారన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Pithapuram Varma | పిఠాపురంలో వర్మపై వివక్ష.. కూటమి నుంచి ఆ సామాజిక వర్గం వెనక్కి

Pavan Kalyan : అనారోగ్యంతో ఇబ్బంది..

పోసాని కృష్ణమురళి ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని ఆమె వ్యాఖ్యనించారు. ఆరోగ్యం బాగా లేని వ్యక్తిని అరెస్ట్​ చేయడం సరికాదన్నారు. ఆయనకు చాలా ఆపరేషన్లు అయ్యాయన్నారు.

Pavan Kalyan : పోసానికి అస్వస్థత

జైలులో ఉన్న పోసాని శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అధికారులు రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కడప రిమ్స్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు.