అక్షరటుడే, భీంగల్ : భీంగల్ లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు లక్ష్మీ సమేత నరసింహస్వామి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని అశ్వవాహనంపై, అమ్మవారిని పల్లకీలో ఉంచి ఎదుర్కోలు ఉత్సవాన్ని జరిపారు. సోమవారం మధ్యాహ్నం కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.