Lavanya Tripathi : మెగా కోడ‌లు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుందిగా.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తుందిగా..!

Lavanya Tripathi : మెగా కోడ‌లు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుందిగా.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తుందిగా..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Lavanya Tripathi : వ‌రుణ్ తేజ్‌ని వివాహం చేసుకున్న లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడ‌లి ప్ర‌మోష‌న్ అందుకుంది. పెళ్లి త‌ర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న ఈ సుంద‌రి ఇటీవ‌ల స‌తీ లీలావ‌తి అనే ప్రాజెక్ట్‌ని షురూ చేసింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ వచ్చింది. స‌తీ లీలావ‌తి ఓ సెన్సిబుల్ స్టోరీ కాగా, ఇందులో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించనుంది. లావణ్యకు జోడిగా దేవ్ మోహన్ కనిపించబోతోన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది వరకే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని మేకర్లు ప్రకటించారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది.

Lavanya Tripathi : లావ‌ణ్య అదిరింది..

హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని ఆ తర్వాత మెగా కుటుంబంలోకి అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. వెండితెరపై అందాల రాక్షసిగా కుర్రకారు మనసు దోచేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కాక రేపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు వెరైటీ దుస్తుల‌లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా లావ‌ణ్య త్రిపాఠి స్టైలిష్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తుంది. ఈ భామ‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.పెళ్లైన త‌ర్వాత కూడా లావ‌ణ్య‌లో గ్లామ‌ర్ ఏ మాత్రం తగ్గ‌లేద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం లావ‌ణ్య క్యూట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

‘అందాల రాక్షసి’ సినిమాతో లావణ్య హీరోయిన్‌గా పరిచ‌య‌మైన లావ‌ణ్య తన తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది . అందానికి అందం, టాలెంట్‌కు రెండూ ఉన్నా అమ్మడకు మాత్రం కెరీర్‌లో పెద్ద హిట్ ఒక్క‌టి రాలేదు. దాంతో కెరీర్‌లో కాస్త వెన‌క‌బ‌డింది. అయితే అదే స‌మ‌యంలో మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ”మిస్టర్”, ”అంతరిక్షం” సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. కొద్ది రోజుల‌కి ఆమెని పెళ్లాడాడు. వీరి నిర్ణయాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది.

Advertisement