అక్షరటుడే, ఇందూరు: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ.. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ పరిణామాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వసంతరావు, న్యాయవాదులు సురేష్, పిల్లి శ్రీకాంత్, వెంకటేశ్వర్, విగ్నేష్, గంగాధర్, మాణిక్ రాజ్, రవి తదితరులు పాల్గొన్నారు.