అక్షరటుడే, ఎల్లారెడ్డి : నాంపల్లి కోర్టులో ఓ న్యాయవాదిపై దాడి జరగడంతో దానికి నిరసనగా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడికి దిగడం సబబు కాదని, దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీద్ పర్వేజ్, గోపాల్ రావు, సతీష్, నమ శ్రీకాంత్, శ్రీనివాస్, పండరి, సాయి ప్రకాష్ దేశ్‌పాండే, సాయిబాబా పాల్గొన్నారు.