అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అదానీని కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోందని లోక్ సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలు వచ్చిన ఎంతో మందిని ఈ దేశంలో అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కొన్ని వేల కోట్లకు సంబంధించిన ఈ విషయంలో అదానీని తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.