అక్షరటుడే, కామారెడ్డి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే తూకాలు ప్రారంభించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకుడు నిజ్జన రమేశ్ అడిషనల్ కలెక్టర్ విక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రమేశ్ మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 25 రోజులు కావస్తున్నా తూకాలు వేయడం లేదన్నారు. దీంతో దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని వివరించారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement