అక్షరటుడే, బాన్సువాడ: హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం హేయమైన చర్య అని హిందూ సంఘాల నాయకులు అన్నారు. ఆలయాలపై దాడి ఘటనలను నిరసిస్తూ బాన్సువాడలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డీఏవోకు వినతిపత్రం ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.