అక్షరటుడే, ఇందూరు: ఆలూరు మండలం గగ్గుపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రణవీర్ సస్పెన్షన్ పై సమగ్ర విచారణ జరపాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అడిషనల్ కలెక్టర్ అంకిత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు రణవీర్ ను డీఈవో ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్ చేశారన్నారు. 2022లో ఓ కేసులో నిందితుడిగా ఉండడంతో సస్పెన్షన్ కు గురయ్యారన్నారు. అయితే ఈ 13 నెలల కాలంలో సుమారు 30 సార్లు తనని పునర్నియామకం చేయాలని డీఈవోకు విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. కావున సమగ్ర విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడిని పునర్నియమించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుధా, రమేశ్, జమీల్, ఉమాజీ, శాంతన్, మల్లికార్జున్ తదితరులున్నారు.