అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఫుడ్‌ డెలివరీల్లో బిర్యానీ మొదటిస్థానంలో నిలిచిందని జొమాటో తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈ ఏడాది అధికంగా 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. సెకనుకు మూడు చొప్పున డెలివరీ చేసినట్లు వెల్లడించింది. బిర్యానీ తర్వాత రెండో స్థానంలో పిజ్జా నిలిచింది. మొత్తం 5.84 కోట్ల పిజ్జాలను డెలివరీ చేశామని పేర్కొంది. దేశవ్యాప్తంగా 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాపీని డెలివరీ చేసినట్లు తెలిపింది.

Advertisement

ఒక్కడే రూ.5లక్షల బిల్లు

జొమాటో డైనింగ్‌ సేవలు కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఒక రెస్టారెంట్‌కు వెళ్లి ఏకంగా రూ.5.13 లక్షల బిల్లును చెల్లించినట్లు తెలిపింది. ఈ స్థాయిలో సింగిల్‌ బిల్లు చెల్లించడం ఇదే తొలిసారని జొమాటో పేర్కొంది.

Advertisement