అక్షర టుడే, కామారెడ్డి గ్రామీణం: కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్‌లో ‘కల్లుసీసాలో జలగ’ అనే ‘అక్షర టుడే’ కథనానికి ఎక్సైజ్ అధికారులు స్పందించారు. ఎక్సైజ్ సీఐ సాయికుమార్ ఆధ్వర్యంలో సంబంధిత దుకాణంలో తనిఖీలు చేశారు. జలగ వచ్చిన కల్లును సీజ్ చేశారు. కల్లు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఫలితాలు వచ్చేవరకు కల్లు అమ్మకాలను నిలిపివేయాలని దుకాణాదారుడికి సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.