అక్షరటుడే, పెద్దపల్లి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారని.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మతోన్మాద వ్యతిరేక సదస్సులో జిల్లా వామపక్ష నేతలు మాట్లాడారు. మతం వ్యక్తిగతమని, మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో పార్టీలు ప్రజల ఆలోచనలు వక్రమార్గం పట్టిస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత రాజన్న, సీపీఐ(ఎం ఎల్) రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.