అక్షరటుడే, జుక్కల్ : Jukkal MLA | జుక్కల్ నియోజకవర్గంలోని లెండి, నాగమడుగు ప్రాజెక్టు Lendi and Nagamadugu project పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు MLA Thota Lakshmi Kanta Rao కోరారు.
ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Minister Uttam Kumar Reddy అధ్యక్షతన జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కౌలాస్ నాలా మరమ్మతులు, సింగీతం రిజర్వాయర్ రిటర్నింగ్ వాల్, పెద్ద ఏడ్గి కాల్వ, బిచ్కుంద కమ్మరి చెరువు మరమ్మతులు పూర్తి చేయాలని, నియోజకవర్గంలోని చిన్న చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని సమావేశంలో కోరారు.
దీనిపై మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ TPCC President Mahesh Kumar Goud, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు Jupally Krishna Rao, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ Shabbir Ali, అధికారులు పాల్గొన్నారు.