Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. వెంటనే వారు టీటీడీ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది.
Advertisement