Char Dham Yatra చార్​ధామ్ యాత్రకు వెళ్దామా.. ఈ నెల 30న ప్రారంభం

Char Dham Yatra చార్​ధామ్ యాత్రకు పోదామా..ఈ నెల 30న ప్రారంభం
Char Dham Yatra చార్​ధామ్ యాత్రకు పోదామా..ఈ నెల 30న ప్రారంభం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Char Dham Yatra : హిందువుల అత్యంత, అత్యున్నత పవిత్రమైన ఆధ్యాత్మి యాత్రలలో ఒకటి చార్ ధామ్ యాత్ర. ఈ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వతాల్లో(Himalayan mountains)ని గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్(Gangotri, Yamunotri, Kedarnath, Badrinath) ఆలయాల సందర్శనకు చేపట్టేదే ఈ చార్​ధామ్ యాత్ర.

Advertisement
Advertisement

చార్​ధామ్ యాత్రను ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. మోక్ష ప్రదాయినిగా కూడా భక్తులు నమ్ముతారు. ఏటా లక్షల్లో భక్తులు ఈ యాత్ర కొనసాగిస్తారు. 2024లో ఈ చార్​ధామ్ యాత్రలో 30 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఈ నెల (ఏప్రిల్) 30న యాత్ర ప్రారంభం కానుంది. చార్​ధామ్ యాత్రలో పాల్గొనాలంటే ఆన్​లైన్(online), ఆఫ్​లైన్​​(offline)లో రిజిస్ట్రేషన్(register) చేసుకోవాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  Helicopter bookings for Kedarnath | కేదార్​నాథ్​కు హెలికాప్టర్​ బుకింగ్స్ ప్రారంభం.. రూ.6 వేలకే టికెట్టు

ఆన్​లైన్​ అనుకుంటే.. అధికారిక వెబ్​సైట్ లో వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం ఈమెయిల్, మొబైల్ నంబరు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ(email, mobile number, Aadhaar, PAN, voter ID) అప్​లోడ్​ చేయాలి. తాజా పాస్​పోర్టు సైజు ఫొటో కచ్చితంగా అవసరం. ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఈ-పాస్ డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆఫ్​లైన్​లో రిజిస్ట్రేషన్ కావాలంటే.. డెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశి, సోనయాగ్ కేంద్రాల(Dehradun, Haridwar, Guptkashi, Soniyag centers)లో నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అక్కడ అవసరమైన ధ్రువపత్రాలు, మెడికల్ సర్టిఫికేట్స్, ఫొటో సమర్పించాలి.

Advertisement