అక్షరటుడే, బాన్సువాడ: ఉపాధ్యాయుడు బాల్‌రాజు సేవలు మరువలేనివని, ఎంతో మంది విద్యార్థులను ఆయన తీర్చిదిద్దారని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బాన్సువాడ పట్టణంలోని మీన గార్డెన్ లో జరిగిన ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు బాల్‌రాజ్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నాగేశ్వర్ రావు, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, కృష్ణరెడ్డి, అంజిరెడ్డి, శ్రీధర్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement