అక్షరటుడే, బోధన్‌: పట్టణంలోని ఉర్దూఘర్‌ అధ్యక్షుడిగా లియకత్‌ హుసేన్‌ ను నియమించారు. నూతన కమిటీని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. కార్యదర్శిగా ఖుర్షిద్‌ హుస్సేన్‌ను నియమించారు. కన్వీనర్‌గా బోధన్‌ తహసీల్దార్‌గా వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా షేక్‌ వాజీద్‌ సభ్యులుగా అజీజ్‌ హుసేన్‌, నసీర్‌ అలీ, సిరాజుద్దీన్‌, సహారాబేగంను నియమిస్తూ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులను ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి బోధన్‌లో అందజేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్ తాహెర్‌ బిన్‌ హందాన్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పద్మా శరత్‌ రెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ గౌసుద్దీన్‌ పాల్గొన్నారు.