LIC | ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ.. మ‌ణిపాల్ సిగ్నాలో మెజారిటీ వాటా కొనుగోలుకు య‌త్నాలు

LIC | ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ.. మ‌ణిపాల్ సిగ్నాలో మెజారిటీ వాటా కొనుగోలుకు య‌త్నాలు
LIC | ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ.. మ‌ణిపాల్ సిగ్నాలో మెజారిటీ వాటా కొనుగోలుకు య‌త్నాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: LIC | ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ఆరోగ్య బీమా రంగంలోకి health insurance sector అడుగుపెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. కొద్ది రోజులుగా హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో కార్య‌క‌లాపాలు చేప‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బీమా సంస్థ‌.. మ‌ణిపాల్ సిగ్నా Manipal Cigna హెల్త్ ఇన్సూరెన్స్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. జీవిత బీమాలో దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉన్న ఎల్ఐసీ.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య బీమా మార్కెట్‌లో ప్ర‌వేశించేందుకు చాలా రోజులుగా ప్ర‌య‌త్నిస్తోంది. వివిధ కంపెనీల్లో వాటా కొనుగోలు చేసేందుకు చ‌ర్చలు చేప‌ట్టింది. అయితే అవేవి కొలిక్కి రాలేదు.

Advertisement
Advertisement

అయితే, తాజాగా మ‌ణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ‌లో వాటాల కొనుగోలు కోసం చ‌ర్చలు జ‌రుపున్న‌ట్లు కంపెనీ సీఈవో సిద్దార్థ మ‌హంత CEO Siddharth Mahanta వెల్ల‌డించారు. మ‌ణిపాల్ సిగ్నాలో 40-49 శాతం వాటా కొనుగోలు చేసే అవ‌కాశ‌ముంద‌ని, దీని విలువ రూ.3,500 కోట్ల నుంచి రూ.3,750 కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. త‌ద్వారా దేశంలోని రూ. 3 లక్షల కోట్ల జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లో 37% వాటా కలిగిన విభాగాన్ని LIC ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుందని పరిశ్రమ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వ రంగ central government sector సంస్థ ఎల్ఐసీకి భారీగా నిధుల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. అనేక ప్ర‌ముఖ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు సైతం ఉన్నాయి. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన బ్యాంకులు, రైల్వేలతో పాటు అదానీ వంటి కార్పొరేట్ సంస్థ‌ల్లో ఎల్ఐసీకి వాటాలు ఉన్నాయి. దేశంలో భారీగా విస్త‌రిస్తున్న ఆరోగ్య బీమా రంగంలోకి ప్ర‌వేశించేందుకు ఎల్ఐసీ చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. ప్ర‌స్తుతం అవి కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. మ‌ణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో Health Insurance వాటాలు కొనుగోలు చేయ‌డం ద్వారా ఈ రంగంలోకి అడుగిడుతున్న‌ట్లు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Advertisement