అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Phone | చాలామంది తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఫోన్లు కావాలనుకుంటారు. కేవలం కాల్స్ మాట్లాడడానికే అయితే ఫీచర్ ఫోన్(FEATURE PHONE) తీసుకుంటారు. అవి వెయ్యి రూపాయల నుంచి లభిస్తాయి.
స్మార్ట్ ఫోన్లు(SMART PHONE) వివిధ కంపెనీలవి రూ. 8 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ కంపెనీ ఎలాంటి సోషల్ మీడియా యాప్స్ లేకుండా ఫీచర్ ఫోన్లకు అదనపు హంగులతో ఫోన్‌ను విక్రయిస్తోంది. ఫీచర్ ఫోన్‌ను పోలి ఉంటుంది కాబట్టి ధర ఏ మూడు వేలో నాలుగు వేలో అనుకుంటే పొరపాటే. ఈ ఫోన్ కొనాలంటే రూ. 51 వేలకుపైన వెచ్చించాల్సిందే.. అరచేతిలో ఇమిడిపోయే సైజ్‌లో ఉండే ఆ ఫోన్ గురించి తెలుసుకుందామా..
New Phone | లైట్ ఫోన్ -3
ఇందులో ఎలాంటి సోషల్ మీడియా యాప్స్(SOCIAL MEDIA APPS) ఉండవు. అలా అని ఇది ఫీచర్ ఫోన్ కాదు. ఇందులో కాలింగ్, మెస్సేజింగ్ సౌకర్యాలతో పాటు కాలిక్యులేటర్, క్యాలెండర్, నోట్స్, పోడ్‌కాస్ట్ ప్లేయర్, కెమెరా, నాయిస్ క్యాన్సిలేషన్, పర్సనల్ హాట్ స్పాట్, వైఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ ID, స్టీరియో స్పీకర్లు వంటి సౌకర్యాలుంటాయి. సోషల్ మీడియా యాప్స్‌తో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్(INTERNET BROWSING), ఈమెయిల్ సదుపాయాలు మాత్రం ఉండవు.
ఫోన్‌లతో గంటల సమయం వృథా చేయడాన్ని నిరోధించేందుకు లైట్ ఫోన్ కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తుంటుంది. జీవితంలో స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
Specifications
- డిస్ప్లే: 3.92″ AMOLED
- బ్యాక్ కెమెరా: 50ఎంపీ + 12ఎంపీ
- సెల్ఫీ కెమెరా : 8MP
- బ్యాటరీ: 1800 Mah
- Varient: 6 GB రామ్, 128GB స్టోరేజ్
- నెట్‌వర్క్: 5G + 4G LTE
- Sim type: NANO SIM + eSIM