Stock Market | పడిలేచిన కెరటంలా.. భారీగా పెరిగిన స్టాక్‌ మార్కెట్‌

Stock Market | పడిలేచిన కెరటంలా.. భారీగా పెరిగిన స్టాక్‌ మార్కెట్‌
Stock Market | పడిలేచిన కెరటంలా.. భారీగా పెరిగిన స్టాక్‌ మార్కెట్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు Domestic stock markets పడిలేచిన కెరటంలా పెరిగాయి. సోమవారం భారీ సెల్లాఫ్‌కు huge sell-off గురైన ఇండెక్స్‌లు.. మంగళవారం లాభాల్లో కొనసాగాయి. ఇండెక్స్‌(Index)లలో రోజంతా తీవ్ర ఒడిదుడుకులు కొనసాగినా మంచి లాభాల్లోనే ముగిశాయి. మంగళవారం ఉదయం 876 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ Sensex.. ఇంట్రాడేలో గరిష్టంగా 1,722 పాయింట్లు పెరిగింది. చివరికి 1,089 పాయింట్ల లాభంతో 74,227 వద్ద ముగిసింది. 285 పాయింట్ల గ్యాప్‌ అప్‌తో ట్రేడిరగ్‌ ప్రారంభించిన నిఫ్టీ Nifty.. ఇంట్రాడేలో గరిష్టంగా 536 పాయింట్లు లాభపడిరది. చివరికి 374 పాయింట్ల లాభంతో 23,535 వద్ద స్థిరపడిరది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద మంగళవారం సుమారు రూ. 7 లక్షల కోట్లు పెరిగింది.

Advertisement

Stock Market | అన్ని రంగాల షేర్లలో దూకుడు

అన్ని రంగాల all sectors షేర్లు రాణించాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్‌(PSU Bank) స్టాక్స్‌ ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ Nifty PSU Bank Index 2.64 శాతం పెరిగింది. రియాలిటీ ఇండెక్స్‌ 2.47 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ 2.20 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ FMCG Index 1.99 శాతం, ఫార్మా 1.91 శాతం, ఇన్‌ఫ్రా 1.88 శాతం, ఐటీ 1.76 శాతం, ఫిన్‌ నిఫ్టీ 1.64 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.63 శాతం, మెటల్స్‌ 1.52 శాతం పెరిగాయి. ఎనర్జీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ Energy and Private Bank Index 1 శాతానికిపైగా లాభపడ్డాయి.

Stock Market | కలిసొచ్చిన అంశాలు

Trump Tariffs విషయంలో చైనా, యూరోపియన్‌ యూనియన్‌ వెనక్కి తగ్గకపోవడంతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు international environment ఉన్నా.. ఇతర దేశాలు అమెరికాతో చర్చలు కొనసాగిస్తుండడం, మిగతా దేశాలతో పోల్చితే సుంకాల ప్రభావం మనపై ఎక్కువగా ఉండకపోవచ్చన్న అంచనాలతో మార్కెట్లు కోలుకుంటున్నాయి. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ RBI MPC meeting కొనసాగుతోంది. వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లను తగ్గిస్తారన్న అంచనాలుండడంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. సోమవారం భారీ సెల్లాఫ్‌ రావడంతో కనిష్టాల వద్ద స్టాక్స్‌ కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో ఈరోజు రిలీఫ్‌

ఇది కూడా చ‌ద‌వండి :  Stock Market | కొనసాగిన ర్యాలీ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market | ర్యాలీ వచ్చింది.

బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 3,093 లాభాలతో, 871 నష్టాలతో ముగిశాయి. 119 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. 13 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను upper circuit, 12 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. 52 స్టాక్స్‌ 52 వారాల గరిష్టాన్ని తాకగా 54 స్టాక్స్‌ 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Stock Market | Top 5 Gainers

బీఎస్‌ఈలో విజయ డయాగ్నోస్టిక్స్‌ Vijaya Diagnostics 14 శాతానికిపైగా లాభపడి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. జీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ 10.56 శాతం, టీడీ పవర్‌ సిస్టవమ్స్‌ TD Power Systems 9.87 శాతం, పారాదీప్‌ ఫాస్పేట్‌ 9.63 శాతం, ఇండోకౌంట్‌ ఇండస్ట్రీస్‌ 8.97 శాతం లాభపడ్డాయి.

Stock Market | Top 5 Losers

డెలివరీ స్టాక్‌ Delivery stock 7.32 శాతం నష్టపోగా జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌ 4.56 శాతం, 360 వన్‌ 4.34 శాతం, సార్దా ఎనర్జీ అండ్‌ మినరల్స్‌ Sardha Energy and Mineral 4.14 శాతం, ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ 3.75 శాతం నష్టపోయాయి.

Advertisement