అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేటను సోమవారం ఉదయం మంచు కప్పేసింది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పొగ మంచు పరుచుకుంది. ఒకరికి ఒకరు ఎదురుగా తారసపడినా గుర్తించలేనంత దట్టంగా మంచు పేరుకుపోయింది. దీంతో రోడ్లపై వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. యువతీయువకులు మంచుతో సెల్ఫీలు దిగుతూ సంబరపడ్డారు.