అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మానవాళిని కాపాడుకుందామని ఎంపీవో మలహరి అన్నారు. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా లింగంపేట మండలం బానాపూర్ గ్రామం, బానాపూర్ తండాను సందర్శించారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం పంచాయతీ దస్త్రాలను పరిశీలించారు. ముంబాజిపేటలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. హోటల్లో ప్లాస్టిక్ గ్లాసులకు బదులు స్టీల్ గ్లాసులను ఏర్పాటు చేసుకోవడంతో హోటల్ యజమానితో పాటు జీపీ కార్యదర్శి పవన్ కుమార్ ను అభినందించారు.