అక్షరటుడే, ఆర్మూర్: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు లింగం తెలిపారు. 14 ఏళ్లలోపు చిన్నారులు గ్రహణం, మొర్రి, ప్రమాదాల్లో ఏర్పడిన వైకల్య లోపాలు, పక్షవాతం ఇతర సమస్యలతో బాధపడే వారికి చికిత్సలు చేయిస్తామని పేర్కొన్నారు. ఈనెల 9 తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమున్న వారికి చికిత్స చేయిస్తామని చెప్పారు. వివరాలకు 040- 23489049 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.