విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని సరస్వతి శిశుమందిర్‌లో శనివారం ఉచిత దంత వైద్యశిబిరం నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూరు, తెలంగాణ మల్టీ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ఇందూరు ప్రతినిధులు విజయానంద్‌, చింతల గంగాదాస్‌, లింబాద్రి, సరిత పాల్గొన్నారు.