అక్షరటుడే, ఇందూరు: Lions Club of Indur | లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు(Lions Club of Indore) నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నగరంలోని సందీప్ గార్డెన్స్(Sandeep Gardens)లో క్లబ్ రీజియన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ(Club Regional Chairman Lakshminarayana) ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
అధ్యక్షుడిగా అబ్బాయి లింబాద్రి, కార్యదర్శిగా పెట్టిగాడి రాఘవేందర్, కోశాధికారిగా అంకం రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చెన్న రవీంద్రనాథ్ గుప్తా, పెట్టిగాడి శ్రీనివాస్, ఎల్‌సీఎఫ్ కో–ఆర్డినేటర్‌గా తిరుమల శివలింగం, మార్కెటింగ్ ఛైర్మన్‌గా చింతల గంగాదాస్, జీఎస్టీ కో–ఆర్డినేటర్ దాసరి రాఘవేందర్‌ను ఎన్నుకున్నారు.