Police | పోలీస్​ స్టేషన్​లో మందు పార్టీ.. షాక్​ ఇచ్చిన అధికారులు

Police | పోలీస్​ స్టేషన్​లో మందు పార్టీ.. షాక్​ ఇచ్చిన అధికారులు
Police | పోలీస్​ స్టేషన్​లో మందు పార్టీ.. షాక్​ ఇచ్చిన అధికారులు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police | తాము పనిచేసే పోలీస్​ స్టేషన్​లోనే మందు పార్టీ చేసుకున్నారు ఇద్దరు పోలీసులు. విధులు నిర్వహించే ఠాణానే సిట్టింగ్​ స్పాట్​గా మార్చుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి హెడ్ కానిస్టేబుల్ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్ స్టేషన్​లోనే మద్యం తాగారు. తాము బయట మందు తాగితే ఇబ్బంది అవుతుంది అనుకున్నారో ఏమో ఏకంగా ఠాణాలోనే దుకాణం తెరిచారు.

Police | ఫొటోలు వైరల్​

పోలీసులు స్టేషన్​లో మద్యం తాగుతున్న ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులు తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. దీంతో ఈ విషయం బయటకు రావడంతో పాటు ఫొటోలు వైరల్​ అవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హెడ్​ కానిస్టేబుల్​ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్​ను సస్పెండ్​ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి