అక్షరటుడే, వెబ్‌డెస్క్ Liquor Shops : కొన్ని పండుగలని పురస్కరించుకొని వైన్ షాపులు బంద్ (Wine shops closed) చేయడం మనం చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ శుక్రవారం అంటే మార్చి 14న హోలీ సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ శాఖ Police Department ఆదేశించింది. పండుగ నేపథ్యంలో.. 14న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు Police Commissioner Sudheer Babu ఉత్తర్వులు జారీ చేశారు. హోలీ పండుగ Holi Festival సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా , శాంతి భద్రతలకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్.. బీర్ల ధరలు పెంచి మందుబాబులకు షాక్ ఇచ్చినా కూడా ఎవరూ తగ్గడం లేదు.
Liquor Shops : ఇలాంటి ఝలక్ ఇచ్చారేంటి..
కేవలం మద్యం దుకాణాల యజమానులకే కాదండోయ్.. మందుబాబులకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోలీ సంబరాల పేరుతో.. మద్యం తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. హోలీ Holi పండుగ పేరుతో ఇతరులకి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బహింగ ప్రదేశాల్లో వాహనదారులు, సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లుతూ ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది యువత మాత్రం హోలీ పేరుతో గుడ్లు, టమాటాల కొడుతూ.. ఇతరులను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే.
సంబరాల పేరుతో మద్యం మత్తులో.. తమ స్నేహితుల మీదే కాకుండా అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లుతూ, గొడవలకు దిగుతూ నానా రచ్చ చేస్తుండడం కూడా మనం చూస్తుంటాం. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు పోలీసులు. ఇక హోలీ అంటే ఎంతో కొంత మందు వేసి పండుగ జరుపుకుంటారు. మరి ఇప్పుడు మందు లేకపోతే ఎలా అని కొందరు డీలా పడిపోతున్నారు. అయితే సాయంత్రం ఆరు తర్వాత మందేస్తే పాయే అంటూ.. ఇంకొందరు ముచ్చటించుకుంటున్నారు. ఏది ఏమైనా రేపు మద్యం బంద్ అనేది కొంత ఇబ్బంది కలిగించే విషయం అని అంటున్నారు మద్యం ప్రియులు..!