Gold Loans | బంగారంపై రుణాలు ఇక కష్టమే.. కొత్త నిబంధనలు తీసుకురానున్న ఆర్బీఐ

బంగారంపై రుణాలు ఇక కష్టమే..ఆర్బీఐ కొత్త నిబంధనలు
బంగారంపై రుణాలు ఇక కష్టమే..ఆర్బీఐ కొత్త నిబంధనలు
Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: Gold Loans : అత్యవసర సమయాల్లో చాలా మందిని బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ ఆర్థికంగా ఆదుకుంటాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ తరహా రుణాలు అందిస్తున్నాయి. కేవలం ఒకే నిమిషం పేరుతో ఆకట్టుకుంటూ మనుగడ సాధిస్తున్నాయి. అయితే ఇకపై ఇలాంటి రుణాలు కష్టతరం కాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబ్బంధనలు రూపొందిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ కొత్త రూల్స్ గోల్డ్ లోన్ మంజూరును కఠినతరం చేయబోతున్నాయంటున్నారు. ఇవి అమల్లోకి వస్తే.. గోల్డ్ లోన్ అంత ఈజీకాదనేది టాక్​.

గోల్డ్ తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు దొరుకుతుంది. బంగారం విలువ అలాంటిది మరి. అయితే, ఇటీవలి కాలంలో గోల్డ్ రుణాలతోపాటు వివాదాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే బంగారం రుణాల మంజూరు నిబంధనలను సమీక్షించాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు తెలిసింది.

Gold Loans : ప్రస్తుత సమస్యలు..

బంగారు రుణాల మంజూరులో ఆర్బీఐ అనేక లోపాలను గుర్తించింది. గోల్డ్ వ్యాల్యూ నిర్ధారించే దగ్గర్నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఒకే పాన్ కార్డుపై అనేక బంగారు రుణాలు మంజూరు అవుతున్నాయి. రుణం తిరిగి చెల్లించలేదనే వంకతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే వారి బంగారాన్ని వేలం వేస్తున్న ఘటనలు ఉన్నాయి. గోల్డ్ లోన్స్ ముసుగులో జరిగే దోపిడీ, మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ సిద్ధం అవుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  RBI | త్వరలో కొత్త రూ.100, రూ.200 నోట్లు

Gold Loans : గట్టి బాధ్యతలే..

బంగారం రుణాల మంజూరు విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, ఎన్ఎఫ్ బీసీలకు రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.

  • రుణాల మంజూరులో అన్ని సంస్థలు కూడా ఒకే విధమైన విధివిధానాలు పాటించాల్సి ఉంటుంది.
  • బంగారు రుణం మంజూరుకు ముందు అప్పు కోసం వచ్చిన వారి పూర్తి వివరాలు తీసుకోవాలి.
  • ఆ గోల్డ్ వారిదేనా అని నిర్ధారించుకోవాలి.
  • రుణం ఎందుకనేది తెలుసుకోవాలి.
  • తీసుకున్న డబ్బులు దేనికి వెచ్చించారో పర్యవేక్షించాలి.
Advertisement