అక్షరటుడే, ఎల్లారెడ్డి : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ చేసిన అభివృద్ధిని వివరించేందుకు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పల్లెనిద్ర బాటపట్టారు. మంగళవారం రాత్రి అన్నసాగర్‌ గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ నేత వెంకట్రామిరెడ్డి, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కుడుముల సత్యనారాయణలు మట్లాడుతూ ఈనెల26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించనుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కో- ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుల దృష్టికి తేవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం ఐక్యమత్యంగా ఉండి సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. మాజీ జడ్పీటీసీ సామెల్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.