Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: నగర శివారులోని అలీసాగర్​ ప్రాజెక్ట్​ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం స్థానిక బెరుకు గుట్ట వద్ద చిరుత కనిపించదని సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు బుధవారం పాదముద్రలు సేకరించారు. ఈ ముద్రలు చిరుతవేనా కావా అని తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ఆధారాలున్నాయని.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్లు ప్రతాప్​, ప్రవీణ్​లు పేర్కొన్నారు.

Advertisement