అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : నగరంలోని పూలాంగ్‌ వంతెన ప్రాంతంలో మున్సిపల్‌ తాగునీరు వృథాగా పోతోంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంరోజులుగా పూలాంగ్‌ ప్రాంతంలో పైప్‌లైన్‌ పగిలి నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. లీకేజీ కారణంగా పరిసరాలు బురదమయంగా మారాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరిచాలని కోరుతున్నారు.