అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | డంపింగ్ యార్డులో dumping yard మంటలు వ్యాపించి పొగ రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని నాగారం 300 క్వార్టర్స్ Nagaram 300 quarters వద్ద గల డంపింగ్ యార్డులో ఆదివారం రాత్రి మంటలు వ్యాపించాయి. దీంతో పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఊపిరి ఆడాక అస్వస్థతకు గురై 10 మంది ఆస్పత్రిలో చేరారు.
సీపీఎం నగర కార్యదర్శి సుజాత CPM City Secretary Sujatha అక్కడికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. పొగ సమస్య పరిష్కరిస్తామని గతంలో మున్సిపల్ కమిషనర్ Municipal Commissioner హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టకుంటే ఆందోళనలు నిర్వహిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అధికారుల తీరును నిరసిస్తూ అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు లావణ్య, కవిత, జ్యోతి, భూలక్ష్మి, సోనీ, లక్ష్మీ, మనమ్మ, విజయ, గంగాధర్, శ్రీధర్, కల్యాణ్ సంతోష్ పాల్గొన్నారు.