అక్షరటుడే, ఇందూరు: సమష్టి కృషితోనే లోక్ అదాలత్ విజయవంతమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. మంగళవారం నగరంలోని సీపీ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. 12వేల క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవడం గొప్ప విషయమని సీపీ కల్మేశ్వర్ అన్నారు. అనంతరం పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్లు కోటేశ్వరరావు, శంకర్ నాయక్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎస్ బీఐ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement