Advertisement
అక్షరటుడే, న్యూఢిల్లీ: కొత్త ఇన్కమ్ టాక్స్ బిల్లును పరిశీలించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 31 మంది లోక్ సభ సభ్యులతో కూడిన సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి భాజపా ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వం వహిస్తారు. ఈ ప్యానెల్ తదుపరి సెషన్ మొదటి రోజు నాటికి తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. వర్షాకాల సమావేశాలు జులై మూడు, నాలుగో వారంలో ప్రారంభం కావచ్చు.
Advertisement